1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

నా బోయ్‌ఫ్రెండ్ బిజినెస్‌మెన్: ఫర్జానా

బోయ్‌ఫ్రెండ్ బిజినెస్‌మెన్ ఫర్జానా
WD PhotoWD
భాగ్యలక్ష్మీ బంపర్‌డ్రా చిత్రంతో తెలుగులో అడుగుపెట్టిన ఫర్జానా ఆపై సీమశాస్త్రి చిత్రంలోనూ నటించింది. కాస్త బొద్దుగా, ముద్దుగా ఉండే ఈ చిన్నది అల్లరి నరేష్‌తో ప్రేమాయణం సాగిస్తోందన్న పుకార్లు ఆమధ్య ఇండస్ట్రీలో షికార్లు చేశాయి. నరేష్‌తో అఫైర్ ఉన్న కారణంగా అతను తన సినిమాల్లో ఫర్జానానే హీరోయిన్‌గా తీసుకోవాలని సిఫారసు చేస్తుంటాడని కూడా చెప్పుకున్నారు.

అయితే నరేష్‌తో తనకు ఎలాంటి అఫైర్ లేదని, అతను తన సహ నటుడు మాత్రమే అని ఫర్జానా స్పష్టం చేసింది. దాంతో ఫర్జానా, నరేష్‌ల మధ్య అఫైర్ ఉందన్న పుకార్లకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే ఫర్జానాకు బోయ్‌ఫ్రెండ్ ఉన్నమాట నిజమేనని అతను షూటింగులకు కూడా వస్తుంటాడని మళ్లీ ఇండస్ట్రీలో గుసగుసలు బయలుదేరాయి.

కానీ ఈసారి వినిపించిన గుసుగుసలు మాత్రం నిజమేనంటూ ఫర్జానా చెబుతోందట. అవును నాకు బోయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. అయితే అతను సినిమారంగాని చెందినవాడు కాదని ఫర్జానా చెబుతోందట. తన బోయ్‌ఫ్రెండ్ ఓ వ్యాపారవేత్త అని తనను చూడడానికి షూటింగ్ స్పాట్‌కు వస్తుంటాడని ఫర్జానా వివరించిందట.

అంతేనా తాను ఎక్కువసార్లు నటించిన హీరోతో తనకు సంబంధాలున్నాయంటూ పుకార్లు పుట్టించొద్దని అవి వింటే తన బోయ్‌ఫ్రెండ్ కోప్పడుతాడని నవ్వుతూ చెప్పిందట. అయితే ప్రస్తుతాని తాము ప్రేమికులుగానే కొనసాగుతున్నామని మరో మూడేళ్లపాటు తాము పెళ్లి చేసుకోబోవడం లేదని ఆమె చెప్పిందట.

అంతాబాగానే ఉందికానీ... ఇండస్ట్రీలోకొచ్చి ఇంకా అరడజను సినిమాలు కూడా నటించలేదు. అప్పుడే ఇన్ని పుకార్లు వస్తున్నాయంటే అమ్మో ఫర్జానా సామాన్యురాలు కాదండోయ్... అంటూ కొందరు మళ్లీ గుసగుసలు మొదలుపెట్టారట.