1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

ప్రేక్షకులను కవ్వించడానికి ''కావేరీ ఝూ'' సదా సిద్ధం

ప్రేక్షకుల కవ్వించడా 'కావేరీ ఝూ సిద్ధం
FileWD
తెరపై అడుగుపెట్టిన తొలిచిత్రంతోనే తన అందచందాలతో ప్రేక్షకుల మతులు పోగొట్టిన కావేరీ ఝూ మరోసారి తెరపై తన గ్లామర్‌ను ఒలకపోయడానికి సిద్ధమవుతోంది.

తొలిచిత్రం 'నగరం"లో శ్రీకాంత్‌కు జోడీగా నటించిన కావేరీ ఝూ ఆ చిత్రంలో చేసిన ఎక్స్‌ఫోజింగ్ చూచి సినీ ప్రేక్షకులు ముక్కుపై వేలేసుకున్నారు. దీంతో ఆ చిత్రం బాక్సాఫీస్ ముందు బోల్తాపడినా కావేరీకి మాత్రం అవకాశాలు క్యూ కట్టాయి.

ప్రస్తుతం శివాజీ హీరోగా రానున్న 'నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్' చిత్రంలో కావేరీ హీరోయిన్‌గా నటిస్తోంది. నాగేంద్రకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

ఈ సందర్భంగా జరిగిన షూటింగ్‌లో కావేరీఝూ, ముంబై డాన్సర్లపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. కన్నుల్లో జలక్... కవ్విస్తే కసక్... అంటూ సాగే ఈ పాటలో కావేరీ నిజంగానే కసక్ అనేలా నటిస్తోంది.

ఎయిర్‌హోస్టెస్‌గా ఉండి సినిమారంగంలోకి అడుగుపెట్టిన కావేరీఝూ ఒల్లుదాచుకోకుండా చేస్తున్న ప్రయత్నాలు తెలుగుతెరపై ఆమెను కమర్షియల్ హీరోయిన్‌గా నిలబెడుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
About Writer
Munibabu