పాత్రలో లీనమవ్వాలంటే అదే బెటర్: హన్సిక
|
అసలు తాను ఇకపై తెలుగులో నటించదల్చుకోలేదని చెప్పినట్టు కూడా అప్పట్లో రూమర్లు గుప్పుమన్నాయి. అయితే ఆ వార్తలు నిజం కాదన్న రీతిలో తాజాగా 'కంత్రి'తో మళ్లీ హన్సిక తెలుగుతెరపై కనిపించింది. ప్రస్తుతం హన్సికకు తెలుగు చిత్రాల్లో ఏమేరకు ఆఫర్లు వస్తున్నాయో తెలియదు కానీ... ఆమె మాత్రం మళ్లీ ఓ కొత్త స్టేట్‌మెంట్ ఇస్తోందట.
తాను ఇకపై ఒక సమయంలో ఒకే చిత్రంలో మాత్రమే నటిస్తానని హన్సిక చెబుతోందట. అదేంటంటే తాను నటించే చిత్రంలోని పాత్రలో లీనమవ్వాలంటే ఒకేసారి రెండు మూడు చిత్రాల్లో నటిస్తే వీలుకాదని ఈ అమ్మడు చెప్పుకొచ్చిందట. అందుకే తాను ఇకముందు ఒక సినిమా చేసే సమయంలో మరో చిత్రాన్ని ఒప్పుకోనని చెబుతోందట.
ఇవన్నీ వింటున్న సినీ జనాలు మాత్రం హన్సికకు అందాలు పెరిగినా వయస్సు మాత్రం చిన్నదే కదా... అందుకే అలాంటి అర్ధం లేని స్టేట్‌మెంట్లు ఇస్తుంటుందిలే అంటూ చెప్పుకుంటున్నారట.
