1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

'బికినీ'తో అందాల ప్రదర్శనకు 'శ్రియ' రెడీ

బికినీ అందాల ప్రదర్శన 'శ్రియ రెడీ
FileWD
'ఇష్టం' చిత్రంతో తెలుగుతెరపై అడుగు పెట్టేనాటికి అమాయకంగా, పక్కింటి అమ్మాయిలా సాంప్రదాయబద్ధంగా కనిపించిన శ్రియ ఆపై తన రూటు మార్చేసింది. హీరోయిన్‌గా ఆఫర్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ శ్రియ ధరించే దుస్తులు సైజు మాత్రం తగ్గిపోతూ వచ్చింది.

దాంతో తెరపై శ్రియను బికినీతో చూడకపోయినా కాస్త హాట్‌ హాట్‌గానే చూస్తూ వచ్చాం. అయితే శ్రియను బికినీలో సైతం చూసే ఛాన్స్ అంత దూరంలో లేదని ఇండస్ట్రీలో గుసగుసలు బయలుదేరాయి. ఎందుకంటే శివాజీ చిత్రంలో నటించిన తర్వాత శ్రియ మార్కెట్ ఒక్కసారిగా ఊపందుకుంది. దాంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన శ్రియ అటుపై హలీవుడ్‌లోనూ ఆఫర్లు అందివచ్చాయి.

దాంతో బాలీవుడ్, హాలీవుడ్‌లలో తన ఇమేజ్ నిలుపుకోవడానికి శ్రియ అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే తాజాగా ఓ సినీ పత్రిక కోసం బికీనీతో ఫోజులిచ్చి అభిమానుల మనసును మరింత అకట్టుకుంది.

ఆ పత్రిక కోసం శ్రియ బికినీలో ఇచ్చిన ఫోజులు చూచిన వారికి మతులు పోతున్నాయట. దీంతో ముందు ముందు సినిమాల్లో సైతం శ్రియ అందాలను బికినీలో చూడవచ్చని వారు తెగ ఆనందపడుతున్నారట. ఆ పత్రికకు శ్రియ ఇచ్చిన ఫోజులు చూచినవారు బాలీవుడ్, హాలీవుడ్ అలవాట్లు శ్రియకు అప్పుడే ఒంటబట్టేశాయని అనుకుంటున్నారట.