1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

ఐర్లాండ్ వరున్ని వరించనున్న కేరళ కుట్టి ''గోపిక''

ఐర్లాండ్ వరున్ని వరించ కేరళ కుట్టి గోపిక
FileWD
రవితేజ హీరోగా వచ్చిన నా ఆటోగ్రాఫ్ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచమైన బూరె బుగ్గల గోపిక అటుపై కొన్ని చిత్రాల్లో నటించింది. అయితే హోమ్లీ లుక్‌తో సాంప్రదాయకమైన పాత్రల్లో మాత్రమే కనిపించడంతో తెలుగులో ఆమెకు పెద్దగా ఆఫర్లు లబించలేదు.

కానీ తమిళం, మళయాళం, కన్నడ చిత్రాల్లో మాత్రం అప్పుడప్పుడూ నటిస్తూనే ఉంది. అయితే ప్రస్తుతం ఈ మలయాళ ముద్ధుగుమ్మ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతోంది. ఐర్లాండ్‌కు చెందిన అభిషేక్ అనే డాక్టర్‌ను గోపిక త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్టు సమాచారం.

ఈ విషయమై గోపిక మాట్లాడుతూ ఇంట్లో పెద్దవాళ్లు నిశ్చయించడంతో తాను ఈ పెళ్లికి సిద్ధమయ్యానని చెప్పింది. జూలై 17న కేరళలోని తన సొంతఊరు కొత్తమంగళంలో వివాహం జరగనున్నట్టు ఆమె తెలిపింది.

అలాగే ఆమె మాట్లాడుతూ పెళ్లి తర్వాత తాను సినిమాల్లో నటించనని తెలిపింది. తన భర్తతో కలిసి ఐర్లాండ్ వెళ్లిపోయి గృహిణిగా ఉంటానని కూడా ఆమె తెలిపింది.