''లారెన్స్'' దర్శకత్వంలో ''చిరుత'' నటించేనా... ?
|
ఆ ఊపుతో మళ్లీ నాగార్జున, లారెన్స్ కాంబినేషన్‌లో వచ్చిన డాన్ చిత్రం కమర్షియల్‌గా హిట్ సాధించక పోయినా లారెన్స్ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలించింది. దాంతో లారెన్స్ దర్శకత్వం పట్ల ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఇలాంటి తరుణంలో మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్ తేజ హీరోగా లారెన్స్ దర్శకత్వం వహించడానికి రంగం సిద్ధమవుతోందని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్ తన రెండో చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత ఆయన తన సొంత బేనర్లోనే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటించనున్నారని తెలుస్తోంది. అయితే లారెన్స్ దర్శకత్వంలో రామ్‌చరణ్ ఎప్పుడు నటించనున్నారన్న విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు.
అయితే చిరంజీవి వద్ద మంచి పేరున్న లారెన్స్ తాను దర్శకుడిగా రామ్‌చరణ్‌తో చిత్రం చేయడానికి స్టోరీ కూడా సిద్ధం చేశారని చెప్పుకుంటున్నారు. ఈ స్టోరీని చిరంజీవి కూడా విన్నారని ఆయన కనుక గ్రీన్‌సిగ్నల్ ఇస్తే లారెన్స్, రామ్‌చరణ్ కాంబినేషన్‌లోని ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయని సమాచారం.
