1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

అడిగితే సిమ్రాన్ ఇవ్వనంటోంది: ఓ నిర్మాత ఆవేదన

అడిగి సిమ్రాన్ ఇవ్వనంటోంది ఓ నిర్మాత ఆవేదన
FileWD
లేత వయసులో తెలుగులోనూ, తమిళంలోను వెండితెరపై ఓ ఊపు ఊపిన సిమ్రాన్‌కు ప్రస్తుతం అంత డిమాండ్ లేక పోయినా ఓ మోస్తరుగా నెట్టుకొస్తోంది. ప్రేక్షకులు తనను మరిచిపోకుండా ఉండడానికి అడపాదడపా సిమ్రాన్ కొన్ని చిత్రాల్లో తళుక్కుమంటోంది.

అయితే సిమ్రాన్‌లో ఓ విశేషం ఉంది. కెరీర్ ప్రారంభంలో టాప్ హీరోల సరసన నటించిన సిమ్రాన్ వయసు పెరిగి అవకాశాలు తగ్గగానే కామెడీ హీరోలతో సైతం నటించడానికి సిద్ధమైంది.

ఆ కోవలో వచ్చిందే 'జాన్ అప్పారావ్ 40ప్లస్' చిత్రం. ఈ చిత్రంలో కృష్ణభగవాన్ సరసన నటించిన సిమ్రాన్ తన ముదర అందాలతో సైతం అభిమానులను ఆకట్టుకుంది. అయితే సినిమానే నమ్ముకుంటే వీలుకాదని ప్రస్తుతం తమిళ టీవీ ఛానెల్‌ల్స్‌లోనూ సిమ్రాన్ తన కెరీర్ ప్రారంభించింది. ఇలా కెరీర్‌ను కొనసాగించడానికి నానా అవస్థలు పడుతున్న సమయంలో సిమ్రాన్ గురించి ఓ కొత్త విషయం తెరమీదికొచ్చింది.

గతంలో సిమ్రాన్ చెల్లెలు మోనాల్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమె చనిపోవడానికి కొద్దిరోజుల క్రితం ఓ నిర్మాత తన చిత్రంలో నటించడానికి ఆమెకు కొంత మొత్తం చెల్లించాడట. ఆ డబ్బును నిర్మాత సిమ్రాన్, ఆమె తల్లి సమక్షంలోనే ఆమె చెల్లెలు మోనాల్‌కు చెల్లించాడట.

అయితే ఆ సొమ్ము తీసుకున్న కొద్దిరోజులకే మోనాల్ చనిపోయింది. దాంతో నిర్మాత అనుకున్న చిత్రం కార్యరూపం దాల్చలేదు. దీంతో సదరు నిర్మాత తన డబ్బులు తిరిగి ఇవ్వమని సిమ్రాన్‌ను కోరాడట. తన చెల్లెలికి ఇచ్చిన డబ్బును తానెందుకు చెల్లించాలి అనుకుందో ఏమో నిర్మాతకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడానికి సిమ్రాన్ ససేమిరా అందట.

దాంతో నిర్మాత తన సొమ్ము తిరిగి ఇచ్చే వరకు సిమ్రాన్‌ను వదిలిపెట్టబోనని భీష్మ ప్రతిజ్ఞ చేశాడట. అందులో భాగంగానే సిమ్రాన్ వెంటబడి మరీ తన బాకీ గురించి అడుగుతున్నాడట. మరి ఇలా బాకీ కోసం వెంటపడుతున్న నిర్మాత విషయంలో సిమ్రాన్ ఏమి చేయనుందో అని ఇండస్ట్రీలో వారు ఆసక్తిగా చూస్తున్నారట.