1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

రాజమౌళి దర్శకత్వంలో ''అందాలరాముడు''...?

రాజమౌళి దర్శకత్వం'అందాలరాముడు
FileWD
హాస్యనటుడిగా తనదంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న సునీల్ 'అందాలరాముడు' చిత్రంతో హీరోగానూ విజయం సాధించాడు. కానీ ఆ చిత్రం తర్వాత సునీల్ హీరోగా ఇంతవరకూ ఏ చిత్రం రాలేదు. అయితే కొన్ని చిత్రాల్లో ప్రాధాన్యమున్న పాత్రల్లో సునీల్ నటిస్తూ వస్తున్నాడు.

అలాంటి తరుణంలో సునీల్ మళ్లీ హీరోగా నటించే చిత్రం త్వరలోనే ప్రారంభంకానుందనే వార్తలు టాలీవుడ్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. అయితే సునీల్ హీరోగా నటిస్తున్నాడన్న వార్తకన్నా ఈ చిత్రానికి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించనున్నారన్నదే ఈ వార్తలోని ప్రధాన విశేషం.

ప్రస్తుతం రాజమౌళి మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందించడంలో బిజీగా ఉన్నారు. సునీల్‍‌తో చిత్రాన్ని నిర్మించే విషయంలో ఆయన ప్రస్తుతానికి ఎలాంటి ప్రకటనా చేయలేదు. దాంతో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడం ఎంతవరకు నిజమనే విషయం తెలియాల్సి ఉంది.

ఒకవేళ ఈ న్యూస్ నిజమైతే మాస్ మసాల చిత్రాలకు పేరుగాంచిన రాజమౌళి, కామెడీ కింగ్ సునీల్ కాంబినేషన్‌లో వచ్చే చిత్రం ప్రేక్షకులకు విందు భోజనం కాగలదు.
About Writer
Munibabu