సైలెంట్‌గా సిద్ధమవుతోన్న ''కింగ్''
|
కామాక్షి మూవీస్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ కింగ్ చిత్రాన్ని నాగార్జున మిత్రుడైన శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హిట్ చిత్రాల దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఢీ చిత్రంతో మెగాహిట్ సాధించిన శ్రీనువైట్ల ఆ తర్వాత రామ్, జెనీలియాతో రెడీ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది.
ప్రస్తుతం శ్రీనువైట్ల నాగార్జునను కింగ్‌గా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే కింగ్ అని టైటిల్ ఉన్నంత మత్రాన డాన్‌లాగా ఇది సీరియస్ టైప్ చిత్రం కాదని తెలుస్తోంది. గతంలో నాగార్జున ద్విపాత్రిభినయంలో వచ్చిన పుల్ లెంగ్త్ కామెడీ చిత్రం హలో బ్రదర్ తరహాలోనే ఈ కింగ్ ఉంటుందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ కింగ్ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ కింగ్ చిత్రం మరో మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకువచ్చే అవకాశాలు మెండుగా ఉందనేది టాలీవుడ్ వర్గాల కథనం.
