''రోబో''లోకి క్యూ కట్టిన ''బచ్చన్'' ఫ్యామిలీ...?
|
అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రజినీని మరింత అందంగా చూపించడానికి శంకర్ తనదైన శైలిలో ప్రయత్నించనున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'శివాజీ' చిత్రం సాధించిన విజయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ రోబో చిత్రంలో రజినీకి జోడీగా అందాల ఐశ్వర్య నటిస్తోంది. ఇవన్నీ ఇప్పటివరకు రోబో చిత్రం గురించి అందరికీ తెలిసిన సమాచారం.
అయితే రోబో చిత్రం గురించి ఓ కొత్త విషయం కోలీవుడ్‌లో మహా జోరుగా వినిపిస్తోంది. రోబో చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఓ సన్నివేశంలో నటించనున్నారట. అయితే ఈ విషయంతో పాటు మరో సెటైర్ సైతం కోలీవుడ్‌లో వినిపిస్తోంది.
రోబోలో హీరోయిన్‌గా ఐశ్వర్యారాయ్ నటిస్తుంది అని చెప్పారు. ప్రస్తుతం ఐశ్వర్య మామ అమితాబ్ నటించనున్నారని చెబుతున్నారు. మరికొన్ని రోజులు ఆగి ఐశ్వర్య భర్త అభిషేక్ సైతం రోబోలో కనిపిస్తారని చెబుతారేమో అని తమిళ తంబిలు జోక్‌గా అనుకుంటున్నారట. కానీ మరికొందరు ఈ జోక్ నిజమైన అయ్యే ఛాన్స్ ఉంది అని కూడా అనుకుంటున్నారట.
ఎందుకంటే ఇప్పటికే బాలీవుడ్‌లో ఈ ఫ్యామిలీ ఇలా కలిసే నటిస్తోన్న విషయం అందరికీ తెలిసిందే కదా. అందుకే ఒకరి తర్వాత ఒకరుగా రోబోలో కూడా దర్శనమిస్తారేమో అని వారు చెప్పుకుంటున్నారట.
