నాకు అంతా తెలుసు: జెనీలియా
|
అదేసమయంలో తమిళ రీమేక్‌లోనూ 'బొమ్మరిల్లు' చిత్రం విజయం సాధించడంతో జెనీలియా ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఈ విజయాలకు తోడు జెనీలియా నటించిన 'రెడీ' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తోన్న చిత్రంలోనూ జెనీలియా నటిస్తోంది.
ఇలా వరుస చిత్రాలతో మహా బిజీగా ఉన్న జెనీలియా సంతోషంగా మాట్లాడడంతో పాటు వేధాంత ధోరణిలోనూ మాట్లాడుతోందట. తాను ఏ విషయమైనా స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని జెనీలియా చెబుతోందట. అదేమంటే ఎదుటివాళ్లు చెప్పే మాటలు గొప్పగా అనిపించినా వాటిని విని అనుసరిస్తే కొన్నిసార్లు అపజయాలు తప్పవని జెనీలియా అభిప్రాయమట.
అందుకే మంచైనా చెడైనా తన మనసుకు ఏది అనిపిస్తే అదే చేస్తానని జెనీలియా సెలవిస్తోంది. అంతేలేండి కలిసొచ్చే కాలం వస్తే ఎవరు ఏం చెప్పినా మనం వినాల్సిందే అంటూ జెనీలియా మాటలు విన్నవారు అనుకుంటున్నారట.
