1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

తెరపై మళ్లీ రాబోతోన్న ''బంగారు కోడిపెట్ట''

తెర మళ్లీ బంగారు కోడిపెట్ట
FileWD
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పడానికి ఉపోద్ఘాతాలు అవసరం లేదు. మెగాస్టార్‌గా ఆయన సంపాదించున్న ఘనకీర్తి అలాంటింది. చిరంజీవి తెరపై కనిపిస్తే తమను తాము మరిచిపోయే లాంటి అభిమానులు ఉండడం ఆయనకే సొంతం.

అంత గొప్ప ఇమేజ్ సొంతం చేసుకున్న చిరంజీవి తనయుడుగా రంగప్రవేశం చేసిన రామ్‌చరణ్ తొలిచిత్రం 'చిరుత'లోనే తనేమిటో నిరూపించుకున్నాడు. అందుకే రామ్‌చరణ్‌తో రెండో చిత్రం చేస్తున్న రాజమౌళి ఆ చిత్రం విజయానికి అన్ని రకాలుగా శ్రద్ధ తీసుకుంటున్నారు.

ఈ వరుసలోనే గతంలో చిరంజీవి నటించి సూపర్‌హిట్ సాధించిన 'ఘరానా మొగుడు' చిత్రంలోని ఓ పాటను రామ్‌చరణ్ చిత్రంలో రీమిక్స్ చేయనున్నారు. 'బంగారు కోడిపెట్ట వచ్చెనండి.. ఏ పాప్ప... ఏ పాప్ప...' అంటూ సాగే ఆ పాటకు తాజాగా రామ్‌చరణ్ స్టెప్పులు వేయనున్నారు.

అప్పట్లో ఈ పాట ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అందుకే రాజమౌళి రామ్‌చరణ్ చిత్రం కోసం ఈ పాటను ఎంచుకున్నారు. అప్పట్లో తండ్రి స్టెప్పులేసిన పాటకు ఇప్పుడు తనయుడు స్టెప్పులేయడం ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడేందుకు తోడ్పడుతుందన్నది రాజమౌళి ఉద్ధేశ్యం కాబోలు.

ఘరానామొగుడులో ఈ పాటలో చిరంజీవితో పాటు శృంగార తార డిస్కోశాంతి స్టెప్పులేసింది. ప్రస్తుతం రాజమౌళి చిత్రంలో రామ్‌చరణ్‌తో పాటు స్టెప్పులేయడానికి ముమైత్‌ను ఎంచుకునే అవకాశాలున్నట్టు టాలీవుడ్ వర్గాల కథనం.
About Writer
Munibabu