''పులి''తో జోడీ కట్టనున్న హన్సిక
|
ప్రస్తుతం హన్సిక తన మూడో తెలుగు చిత్రంలో 'పులి'తో జోడీ కట్టేందుకు సిద్ధమైంది. 'జల్సా' చిత్రం తర్వాత ఎస్.జే. సూర్య దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న చిత్రం 'పులి'. ఈ చిత్రంలో పవన్ సరసన నటించేందుకు కొన్నిరోజుల వరకు చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి.
అయితే విచిత్రంగా ఇప్పుడు పవన్ సరసన పులి చిత్రంలో నటించనున్నది హన్సిక అని టాలీవుడ్ వర్గాల కథనం. అలాగే ఈ చిత్రంలోని రెండో హీరోయిన్ పాత్రకు పార్వతీమెల్టన్ పేరు వినిపిస్తోంది. తొలిచిత్రం దేశముదురులోనే కాస్త బొద్దుగా కనిపించిన హన్సిక ప్రస్తుతం మరింత బొద్దుగా తయారైంది. ఇలాంటి పరిస్థితిలో పులి పక్కన హన్సిక ఎలా కనిపిస్తుందో వేచి చూడాలి మరి.
