1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

''అమ్మ'' కావాలంటే ఆమాత్రం ఇవ్వాల్సిందే: టబు

అమ్మ కావాలంటే  ఇవ్వాల్సిందే టబు
FileWD
'కూలీ' నెం.1 చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచయమైన టబు ఆపై అనేక హిట్ చిత్రాల్లో నటించింది. అయితే కొన్ని చిత్రాల తర్వాత బాలీవుడ్‌లో స్ధిరపడిన టబు అటుపై టాలీవుడ్‌ వైపు కన్నెత్తి చూడలేదు. బాలీవుడ్‌లో పలు హిట్ చిత్రాల్లో నటించిన టబు కొన్ని రోజుల క్రితం చంద్ర సిద్ధార్ధ దర్శకత్వంలో వచ్చిన 'ఇదీ సంగతి' చిత్రంతో మళ్లీ తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది.

ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా టబు ముదర అందాలు మాత్రం బాగానే గుర్తుండిపోయాయి. ఇదీ సంగతి తర్వాత తాజాగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన 'పాండురంగడు' చిత్రంలో టబు నటించింది. పాండురంగడు భక్తిరస చిత్రమైనా అందులోని శృంగార సన్నివేశాలకు మాత్రం టబు జీవం పోసింది. పాండురంగడు చూచిన వారంతా టబు సొగసులు గురించే మాట్లాడుకునేంతగా ఆమె ఈ చిత్రంలో నటించింది.

ఇలా మళ్లీ దక్షిణాధిలో టబు కెరీర్ పునఃప్రారంభం అవుతున్న సమయంలో ఓ సంఘటన జరిగింది. తమిళంలో శరత్‌కుమార్ నటిస్తోన్న ఓ చిత్రంలో చిన్న పాత్ర కోసం టబును సంప్రదిస్తే ఆమె 75 లక్షలు డిమాండ్ చేసిందట. చిన్న పాత్రకు టబు అంత సొమ్ము డిమాండ్ చేసే సరికి దర్శకుడికి బుర్ర తిరిగిపోయిందట.

అయితే టబు మాత్రం వాళ్లిచ్చిన పాత్ర చేయాలంటే అంత మొత్తం అడగడంలో తప్పులేదని అంటోందట. ఇంతకీ ఆ చిత్రంలో టబు నటించాల్సింది తల్లి పాత్రలోనట. ఆ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోన్న శ్రియకు తల్లిగా నటించడం కోసమే చిత్ర దర్శకుడు టబును సంప్రదించాడట. అందుకు టబు సైతం శ్రియకు తల్లిగా నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదని అయితే తాను అడిగిన రెమ్యునిరేషన్ ఇవ్వాలని కండీషన్ పెట్టిందట.

టబు చెప్పిన పారితోషికంపై ఆ దర్శకుడు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదట. అయితే టబును అడిగిన పాత్ర కోసం ఆ దర్శకుడు ఇప్పటికే స్నేహ, సిమ్రన్ లాంటి కథానాయకల్ని సంప్రదించాడట. వారెవరూ ఆ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోలేదట. దాంతో చివరకు ఆ దర్శకుడు టబును సంప్రదించాడట. ఇతర హీరోయిన్లు ఒప్పుకోని పాత్రకు టబు ఒప్పుకుందంటే ఆ మాత్రం పారితోషికం అడగడంలో తప్పులేదనిపిస్తోంది కదూ.