1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

విక్రమ్ సరసన తమిళంలో ఇలియానా... ?

విక్రమ్ సరసన ఇలియానా
FileWD
తెలుగులో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న ఇలియానా ప్రస్తుతం అంత బిజీగా లేదన్నది సమాచారం. 'జల్సా', 'భలేదొంగలు' చిత్రాల తర్వాత ఇలియానా నటిస్తున్న చిత్రాలేవీ సెట్స్‌పై లేకపోవడం విశేషం. అయితే ఇలియానా ఇటీవలే మూడు చిత్రాలు చేయడానికి సిద్ధమైందని టాలీవుడ్ వర్గాల కథనం.

తెలుగు ఇండస్ట్రీలో ఇలియానా మార్కెట్ ఎలా ఉన్నా తమిళంలో మాత్రం ఆమెకు అసలు మార్కెట్ లేదనే చెప్పాలి. ఎందుకంటే తమిళంలో ఇలియానా ఇప్పటివరకు ఒక్కచిత్రం మాత్రమే చేసింది. అయితే ఇలియానా చేసిన ఆ ఒక్క తమిళ చిత్రం సైతం బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. దీంతో ఇలియానా మళ్లీ తమిళం వైపు వెళ్లలేదు.

అంతేకాకుండా తమిళంలో నటించడం ఓ చెడ్డ అనుభవం అంటూ ఇలియానా చెప్పుకొచ్చింది. ఇదిలాఉంటే ప్రస్తుతం విక్రమ్ నటించబోయే కొత్త చిత్రంలో నటించడానికి ఇలియానాకు పిలుపు వచ్చిందన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం.

తాజాగా దశావతారం చిత్రానికి దర్శకత్వం వహించిన కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో విక్రమ్ సరసన నటించడానికి ఇలియానాను సంప్రదించారట. అయితే ఆ చిత్రంలో ఇలియానా చేసేదీ లేనిది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ విషయం కనుక నిజమైతే తమిళంలో ఇలియానా మళ్లీ అడుగుపెట్టినట్టవుతుంది.