టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ ప్రస్తుతం ప్రియామణి హాట్ టాఫిక్‌గా మారింది. సినీరంగంలోకి అడుగుపెట్టిన కొద్దిరోజులకే ప్రియామణి ఉత్తమనటిగా జాతీయ అవార్డుకు ఎంపిక కావడంతో అందరి దృష్టి ఆమెపై పడింది.
తమిళంలో ప్రియామణి నటించిన 'పరుత్తి వీరన్' చిత్రంలోని నటనకుగాను ఆమె జాతీయ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. దీంతోపాటు ప్రియామణికి సంబంధించిన మరో విషయం ప్రస్తుతం కోలీవుడ్‌లో జోరుగా వినిపిస్తోంది. ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరున్న మణిరత్నం, హీరో విక్రమ్‌ల కాంబినేషన్‌లో రానున్న చిత్రంలో ప్రియామణి ఎంపికైందన్నదే ఆ విషయం.
అయితే ఈ చిత్రంలో ప్రియామణిది హీరోయిన్ పాత్ర మాత్రం కాదు. ఇందులో నెగటివ్ పాత్రలో నటిస్తున్న పృధ్వీరాజ్‌కు జోడీగా ప్రియామణి నటించనుంది. ఈ చిత్రంలో విక్రమ్ సరసన ఐశ్వర్యారాయ్ నటించనుంది.
ఈ చిత్రంలో ప్రియామణిది హీరోయిన్ రోల్ కాకపోయినా విక్రమ్, ఐశ్వర్యారాయ్ లాంటి వారు నటిస్తున్న చిత్రంలో నటించడం గొప్పేనని కోలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయట. అలాగే మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్ చిత్రంలో చిన్న అవకాశమైన అది చాలా గొప్పదని కూడా వారు అంటున్నారట.