1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

''కాజల్‌''తో కలిసి మళ్లీ రాబోతోన్న ''ఆర్య''

కాజల్ కలిసి రాబోతోన్న ఆర్య
FileWD
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఆర్య చిత్రం ఎంత గొప్ప విజయం సాధించింది అందరికీ తెలిసిందే. ఈ చిత్రం అల్లు అర్జున్‌కు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ వచ్చేలా చేసింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సుకుమార్‌కు సైతం ఈ చిత్రం మంచి పేరునే తెచ్చిపెట్టింది. అయితే ఈ సుపర్ హిట్ చిత్రానికి స్వీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

సుకుమార్ దర్శకునిగా ఆర్య రెండో భాగానికి సిద్ధమవుతోన్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ మళ్లీ హీరోగా నటిస్తున్నాడు. కానీ తొలి ఆర్యలో హీరోయిన్‌గా నటించిన అనుమెహతా రెండో ఆర్యలో నటించబోవడం లేదు. రెండో ఆర్యలో హీరోయిన్‌గా కాజల్ నటిస్తున్నట్టు సమాచారం.

అలాగే ఈ చిత్రంలో అజయ్‌గా నటించిన శివబాలాజీ సైతం రెండో ఆర్యలో కనిపించబోవడం లేదు. శివబాలాజీ పాత్రకు సైతం మరో నటున్ని సంప్రదించారని సమాచారం. మొదటి ఆర్యలో మంచి క్రేజ్ సంపాధించిన ఆర్య, గీత, అజయ్ పాత్రల ప్రవర్తనను మాత్రం అలాగే ఉంచి కథను మరో కోణంలో తీసుకు వెళ్ళనున్నట్టు దర్శకుడు చెబుతున్నారు.

తొలి ఆర్య ప్రేక్షకుల్లో ఓ రకమైన క్రేజ్ తీసుకురాగా మరి రెండో ఆర్య ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ తీసుకొస్తోందో వేచి చూడాలి మరి.
About Writer
Munibabu