పెళ్లి తర్వాత నటించదల్చుకోలేదు: గోపిక
'ఆటోగ్రాఫ్' చిత్రం ద్వారా తమిళతెరకు పరిచయమైన కేరళ కుట్టి గోపిక అదే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే తెలుగులో ఆటోగ్రాఫ్ చిత్రం పెద్దగా సక్సెస్ సాధించకపోవడంతో పెద్ద హీరోల సరసన ఆమెకు అవకాశాలు రాలేదు. కొన్ని చిన్న చిత్రాల్లో మాత్రమే గోపిక నటించింది.
అయితే ముద్దుగా, బొద్దుగా ఉండే గోపిక తమిళ ఇండస్ట్రీలో మాత్రం మొన్నటి వరకు ఆఫర్లతో బిజీగానే గడిపింది. కానీ ఇలాంటి తరుణంలోనే గోపిక పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. ఐర్లాండ్‌లో డాక్టర్‌గా చేస్తున్న అజిలేష్‌తో గోపిక పెళ్లి నిశ్చమయమై పోయింది. ఈ విషయాన్ని గోపికే స్వయంగా సినీ ఇండస్ట్రీలోని అందరికీ తెలిపింది.
దాంతో అటు మలయాళంలో, తమిళంలోని పలువురు నటులు గోపికకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గోపిక మాట్లాడుతూ కెరీర్ కాస్త ఊపులో ఉండగానే తాను పెళ్లి చేసుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. తనకు భర్తగా రాబోతోన్న అజిలేష్ తనకు చాలా నచ్చాడని అతని త్వరలో పంచుకోబోయే జీవితం గురించి తాను ఇప్పటినుంచే కలలు కంటున్నానని చెప్పుకొచ్చింది.
పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తారా అంటే పెళ్లి తర్వాత తాను నటించబోనని స్పష్టంగా చెప్పేసింది. పెళ్లి తర్వాత తాను గృహిణిగానే కొనసాగాలనుకుంటున్నానని అందుకే పెళ్లి తర్వాత తాను నటించనని గోపిక చెబుతోంది.