''కుచేలుడు'' పేరు మార్చుకుంటాడా... ?
|
అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదని నిర్మాత అయిన అశ్వినీదత్ ప్రకటించారు. దాంతో ఈ చిత్రానికి ఎలాంటి టైటిల్ పెడుతారో అని అనుకుంటున్న సమయంలో 'కథానాయకుడు' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టు టాలీవుడ్ సమాచారం. ఈ టైటిల్ వెనుక ఓ కథ కూడా ఉందని కొందరి వాదన.
చిత్రంలో రజనీకాంత్ పాత్ర అతిథి పాత్ర మాత్రమే. కానీ రజినీ ఇమేజ్ దృష్ట్యా ఆ పాత్రనే హైలెట్ చేయడానికి నిర్మాత, దర్శకులు ప్రయత్నిస్తున్నారు. అందుకు తగ్గట్టే ఇప్పుడు సినిమా టైటిల్ సైతం రజనీ పాత్రకు తగ్గట్టే పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ సినిమా హీరో పాత్రలో నటిస్తున్నారు.
అందుకే ఈ చిత్రానికి కథానాయకుడు అనే టైటిల్ పెట్టడం ద్వారా రజనీ పాత్రను హైలెట్ చేయాలన్నదే దర్శక, నిర్మాతల ఆలోచన అన్నది టాలీవుడ్ కథనం. అయితే ఈ చిత్రంలో పూర్తి నిడివి పాత్ర చేయనున్నది మాత్రం జగపతిబాబు. కథ ప్రకారం జగపతిబాబు స్నేహితునిగా రజనీకాంత్ నటిస్తున్నారు.
గతంలో చంద్రముఖి చిత్రంలో సైతం రజనీకాంత్ పాత్రను హైలెట్ చేయడం కోసం మాతృకలోని పాత్ర నిడివి పెంచడం జరిగింది. అదే తరహాలో ఇప్పుడు ఈ చిత్రంలో సైతం రజనీపాత్ర కోసమే టైటిల్ కూడా మార్చనున్నారని టాలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు.
