1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

ఫోటోగ్రాఫర్‌కు శ్రియ థ్యాంక్స్!

ఫోటోగ్రాఫర్‌కు శ్రియ థ్యాంక్స్!
WD PhotoWD
ఫోజులు ఇటివ్వండి.. అటివ్వండి.. అంటూ అడిగే ఫోటోగ్రాఫర్లంటే సినీతారలకు కాస్త చిరాకే. అయితే శ్రియ తన స్టిల్ ఫోటోగ్రాఫర్‌కు థ్యాంక్స్ చెప్పిందట.. ఎందుకో తెలుసా... సెమీ న్యూడ్ బికినీ ఫోటోను అతడు ఓ పత్రికలో ప్రచురించాడట. ఆ ఫోటో బాలీవుడ్‌లో పెను ప్రకంపనలను సృష్టించింది.

శ్రియ స్టిల్స్ చూసి బాలీవుడ్ ఆమెకు ఆహ్వానం పలుకుతోందట. పలు చిత్రాల్లో ఆఫర్ల వెల్లువలా వస్తున్నట్లు సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. రజనీతో నటించిన శివాజీ చిత్రం తర్వాత వెల్లువల్లా వస్తాయనుకున్న అవకాశాలు రాకపోవడంతో విసుగెత్తిన ఆమెకు, ఈ రకంగా బాలీవుడ్ ఆఫర్లు రావడంతో దీనికి కారణమైన తన స్టిల్ ఫోటోగ్రాఫర్‌కు థ్యాంక్స్ చెప్పడమే కాకుండా, మంచి గిఫ్ట్‌ కూడా ఇచ్చిందట. ఇదంతా ఇటీవలే నయనతార బికినీతో ఉన్న ఫోటోను చూశాక తనకే ఐడియా వచ్చిందని సదరు ఫోటోగ్రాఫర్ అసలు విషయాన్ని చెప్పాడట..!