1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

హిందీ "గజిని" 93 కోట్లు!

హిందీ గజిని 93 కోట్లు  గీతా ఆర్ట్స్ పతాకం
WD PhotoWD
అమీర్‌ఖాన్ హీరోగా అసిన్ హీరోయిన్‌గా గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ తన మిత్రుడు బి. మధుతో కలిసి నిర్మిస్తోన్న భారీ చిత్రం "గజిని". బిజినెస్ పరంగా రికార్డులు క్రియేట్ చేసే అల్లు అరవింద్ "గజినీ" ఈ సినిమా రిలీజ్‌కాకముందే వ్యాపార విషయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రికార్డ్ సృష్టించారు. అదేమిటంటారా..? ఈ చిత్రాన్ని 93 కోట్ల రూపాయలకు వ్యాపారం చేశారని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఇప్పటికే తమిళ "గజిని" విదేశాల్లో కూడా మంచి కలెక్షన్ల అందించగా, తెలుగులో డబ్బింగ్‌లో కూడా మంచి విజయాన్ని చవిచూసింది. ఇవన్నే హిందీ "గజినీ"కి ఓ క్రేజ్ తెచ్చాయని విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు అక్టోబర్‌లో హిందీ "గజినీ"ని విడుదల చేయగలమని చిత్ర దర్శకుడు మురుగదాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఇక ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతంతో మంచి మెలోడి పాటలను అందించనున్నట్లు సమాచారం.
About Writer
Selvi