1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

గుడికట్టొద్దు బాబోయ్!

గుడికట్టొద్దు బాబోయ్
WD PhotoWD
అందాలతో యువతను గిలగింతలు పెట్టే మలయాళ ముద్దుగుమ్మ నమిత.. తనకు గుడికట్టొద్దని చెప్పిందట. నమిత కోసం ఆమె అభిమానులు ఆలయాన్ని నిర్మిస్తున్నారని కోలీవుడ్‌లో వార్తలొచ్చిన నేపథ్యంలో, ఇప్పటి వరకు నమిత కోసం ఆలయనిర్మాణం చేపట్టలేదని అభిమాన సంఘం అధ్యక్షుడు సెల్వం స్పష్టం చేశారు.

ఆలయ నిర్మాణంపై నమితను సంప్రదిస్తే, ఆమె గుడికట్టొద్దని తేల్చి చెప్పిందని సెల్వం అన్నారు. అంతేకాకుండా ఆలయ నిర్మాణం వద్దనడానికి తగిన కారణాలను నమిత వెల్లడించలేదని ఆయన తెలిపారు.

ఇదిలా ఉండగా, గతంలో కోలీవుడ్‌ను దడబుట్టించిన కుష్బూవివాదంలో ఆమెకు నిర్మించిన ఓ దేవాలయాన్ని అభిమానులు ఆగ్రహంతో ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. కాగా, నమిత గుడికట్టొద్దనడానికి కూడా ఇదే అంశం కారణంగా ఉండవచ్చునని సినీ వర్గాలు కోడైకూస్తున్నాయి.

మరోవైపు, దక్షిణ తమిళనాడులోని నెల్లైకి చెందిన నమిత వీరాభిమాని జ్యోతి నమిత పేరిట సామాజిక సేవను నిర్వహిస్తోందట. మరీ.. నమితకు ఎంత గొప్పగుణం కలిగిన అభిమానులో కదా...?
About Writer
Selvi