"కథానాయకుడు"లో రజనీ కుమార్తె!
|
ఇకపోతే ఎ.ఆర్. రహమాన్ మేనల్లుడు జి.వి. ప్రకాష్ సమకూర్చుతున్న సంగీతం ఈ చిత్రానికి మరో హైలైట్‌గా నిలుస్తుందని సినీ వర్గాల టాక్. "దశావతారం"లో పద్మభూషణ్ కమల్‌హాసన్ పది గెటప్‌లతో సినీ పరిశ్రమను కుదిపేస్తుంటే, "కథానాయకుడు"లో రజనీ కాంత్ 20 గెటప్‌లతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, సూపర్ స్టార్ రజనీ కాంత్, పి. వాసు కాంబినేషన్‌లో వస్తున్న "కథానాయకుడు' (తమిళంలో "కుచేలన్") చిత్రం ఈ నెల 25v 1500 ప్రింట్లతో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం మిక్సింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న వాసును ఈ మధ్య మీడియా కలిసి "కుచేలన్" తర్వాత మళ్ళీ మీ కాంబినేషన్ ఎప్పుడు అని అడిగితే.. రజనీ సార్‌తో మళ్ళీ సినిమా చేస్తున్నమాట నిజమే... కానీ అది ఎప్పుడనేది ఇంకా చెప్పలేను.
ఈ నెలలో కుచేలన్ విడుదల, ఆగస్టులో "రోబో" షూటింగ్ ప్రారంభమౌతోంది. ఆ తర్వాత రజనీ కుమార్తె సౌందర్య రూపొందిస్తున్న "సుల్తాన్ ది వారియర్" విడుదల, వీటి గ్యాప్‌లోనా? లేక వీటి తర్వాత అనేది ఆయనే నిర్ణయించాలని చెప్పారు. అయితే కుచేలన్ రష్ చూశాక రజనీ సార్ తనను అభినందించారని పి. వాసు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
