ఆ చిత్రంలో.. తండ్రీతనయుల స్టెప్పులు
|
చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ హీరోగా ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న తాజా చిత్రంలో ఈ పాటను రీమిక్స్ చేయనున్నారు. ఇందులో రామ్ చరణ్‌తో పాటు చిరంజీవి సైతం మళ్లీ తెరపై అలనాటి స్టెప్పులు వేయనున్నారు.
గతంలో ఎన్టీఆర్-బాలకృష్ణ, ఏన్నార్-నాగార్జున, కృష్ణ-మహేష్ బాబు ఇలా తండ్రీ కొడుకులు కలసి చిత్రాల్లో నటించారు. ఆ కోవలో కుమారుడు రామ్ చరణ్ తేజ కలసి నటించేందుకు మెగాస్టార్ నటించేందుకు అంగీకరించారు. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న రామ్ కొత్త చిత్రం షూటింగ్‌లో కూడా చిరంజీవి కూడా కలువనున్నట్టు ఫిల్మ్ వర్గాల భోగొట్టా.
ఇదే నిజమైతే.. వెండితెరపై మరో తండ్రీ-కొడుకుల జంట నటనను తిలకించే భాగ్యం తెలుగు ప్రేక్షకులకు లభిస్తుంది. కాగా, 'ఛత్రపతి', 'యమదొంగ', 'కంత్రి' చిత్రాలకు కొరియాగ్రాఫర్‌గా పని చేసి, మంచి మార్కులు కొట్టేసిన ప్రేమ్ రక్షిత్ ఈ సాంగ్‌కు కొరియాగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. చిరంజీవి రాజకీయరంగ ప్రవేశానికి ముందు ఆయన నటనను మరోసారి వెండితెరపై తిలకించవచ్చు.
