రాష్ట్ర వ్యాప్తంగా "ప్రిన్స్" బర్త్ డే
"పోకిరి" హీరో ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలకు రంగం సిద్ధమౌతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 2నుంచి 9వతేదీ వరకు మహేష్ బాబు జన్మదినోత్సవ వేడుకలు జరిపేందుకు అభిమాన సంఘాలు రెడీ అవుతున్నాయి.
ఈ కార్యక్రమాల్లో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆల్ ఇండియా మహేష్-కృష్ణ సేన అధ్యక్ష కార్యదర్శులు దిడ్డి రాంబాబు, పి. మల్లేష్‌లు కోరారు. మహేష్‌బాబు బర్త్‌డేను వైభవంగా జరిపేందుకు సిద్ధమౌతున్న అభిమాన సంఘాలు, ఇందుకు అభిమానులను సమాయత్తపరచడానికి ఈ నెల 20వ తేదీ నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు.
ఇదిలా ఉండగా, మహేష్ బాబు సినిమాల పబ్లీసిటీ విషయంతా ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ స్వయంగా చూసుకుంటోందట. గత చిత్రం సెన్సెషనల్ మూవీ పోకిరి చిత్రం చిత్రీకరిస్తున్నప్పుడు కూడా డ్రెస్‌తో పాటు అతని స్టైల్ కూడా ఇలాగే ఉండాలని చెప్పిన నమ్రత ఇలా మహేష్ వ్యక్తిగత విషయాలలోను పూర్తి బాధ్యత వహించడం విశేషం.
ఆమె చెప్పిన స్టైలే పోకిరి చిత్రానికి అంత క్రేజ్ తెచ్చిందని సినీ వర్గాల భోగట్టా. ఈ మధ్య థమ్స్‌అప్ కంపెనీ బ్రాండ్ అంబాసిడార్‌గా అడ్వర్టైజ్‌మెంట్‌లో మహేష్‌ను నటించమని సలహా ఇచ్చింది నమ్రతేనని ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి.
|