1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

నిర్మాతగా మారనున్న టబూ

తెలుగు వెండితెరపై రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అందాల భామ టబూ
FileFILE
తెలుగు వెండితెరపై రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అందాల భామ టబూ మరో కొత్త అవతారం ఎత్తనుంది. గతంలో చిత్రాలు నిర్మించి చేతులు కాల్చుకున్న సందర్భాలు అనేకం. తాజాగా టబూ కూడా నిర్మాతగా మారనున్నారు. గతంలో హీరోయిన్‌గా కొనసాగి, ఆ తర్వాత వెండితెరకు దూరమైన హీరోయిన్లలో రాశి, రంభ, ఆమని, జీవితా రాజశేఖర్ ఇలా మరికొందరు చిత్రాలను నిర్మించారు.

నిర్మాతలుగా వీరు పెద్ద విజయం సాధించిన దాఖలాలు ఎక్కడా కనిపించవు. సంపాదించిన నాలుగు రూపాయలను భద్రంగా పెట్టుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ, నిర్మాతగా మారి ఉన్న వాటిని పోగొట్టుకునేందుకు ఎవరూ అంగీకరించరు. అందుకే హీరోయిన్లు నిర్మాణ బాధ్యతలపై పెద్దగా ఆసక్తి చూపరు. కానీ ఈ అందాల ముద్దుగుమ్మ మాత్రం ఒక చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే 'ఇదీ సంగతి', 'పాండురంగడు' వంటి చిత్రాలతో తన ప్రత్యేకతను చాటుకున్న ఈ భామ.. తమిళంలో కూడా కె.బాలచందర్, కేఎస్.రవికుమార్ దర్శకత్వాల్లో నటించేందుకు ఎంపికైంది. మరోవైపు బాలీవుడ్‌లోను మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఓ వైపు ఈ చిత్రాల్లో నటిస్తూనే మరో వైపు యూటీవీ మోషన్ పిక్చర్స్ సంస్థతో సంయుక్తంగా ఒక చిత్రాన్ని టబూ నిర్మించనుంది. తన తొలి ప్రయత్నంగా తక్కువ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించే ప్రయత్నంలో ఆమె జోరుగా చర్చలు జరుపుతోంది.
About Writer
PNR