కమర్షియల్ చిత్రాలకే ప్రాధాన్యత: శిల్పా
|
అందువల్ల అలాంటి చిత్రాలు తీసి నష్టాలను చవిచూసేందుకు బదులుగా.. పూర్తి వినోదాత్మకంగా, ప్రేక్షకులను ఆకట్టుకునే మసాలా చిత్రాలను నిర్మించడం మంచిది కదా? అని ఆమె ప్రశ్నించారు. ఇకపై తన నిర్మాణ సంస్థ ఎస్-2 ప్రొడక్షన్స్‌లో కమర్షియల్ సినిమాలనే నిర్మిస్తానని ఆమె చెప్పారు.
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తాజాగా నిర్మించిన 'తారే జమీన్ పర్' వంటి ఒకటి రెండు చిత్రాలు మినహా సామాజిక నేపథ్యంతో కూడిన చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయని శిల్పా గుర్తు చేశారు. గతంలో తాను నిర్మించిన 'ఫిర్ మిలేంగే' చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద బోల్తాపడటం తనను పూర్తిగా నిరాశకు లోను చేసిందన్నారు.
