1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

"వరుడు"గా రానున్న మహేష్‌బాబు?

వెండితెర గుసగుసలు వరుడు రానున్న అతిథి హీరో మహేష్ బాబు  త్రివిక్రమ్ దర్శకత్వం
WD
"అతిథి" హీరో మహేష్ బాబు "వరుడు"గా తెరకెక్కనున్నాడు. రొమాన్స్, యాక్షన్ కథా నేపథ్యంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 9వ తేదీన ప్రిన్స్ బర్త్‌ డే తర్వాత ఈ సినిమాను ప్రారంభించనున్నట్లు సమాచారం. అతిథి, పోకిరి వంటి సినిమాల ద్వారా యాక్షన్ హీరోగా తెరకెక్కిన తనకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు, అభిమానులు చేరువయ్యారని మహేష్ బాబు అన్నారు.

వారి అభిరుచికి అనుగుణంగా యాక్షన్, రొమాన్స్ నేపథ్యంలో కొత్త సినిమా తీసేందుకు రంగం సిద్ధమౌతున్నట్లు వినికిడి. యాక్షన్, రొమాన్స్‌ మిళితంగా రూపొందనున్న "వరుడు" సినిమాకు చెందిన రెండు షెడ్యూళ్లను కేరళ, రాజస్థాన్‌లలోని వివిధ లొకేషన్లలో చిత్రీకరించనున్నట్లు సినీ వర్గాల సమాచారం.

సింగమల రమేష్ నిర్మాత సారథ్యం వహిస్తున్న ఈ సినిమాను 2009 వేసవిలో విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో "పోకిరి" 6ప్యాక్‌తో నటించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. మరీ "వరుడు"గా వస్తున్న ఈ అతిథి ఎంతమంది యువతుల మదిని దొంగలిస్తాడో వేచి చూడాల్సిందే మరీ...!
About Writer
Selvi