ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ బరువు తగ్గించుకున్నారట. అదేదో.. అతని మీద ఉన్న విమర్శల బరువును తగ్గించుకున్నాడని కాదండి.. నిజంగా ప్రకాష్ రాజ్ తన వెయిట్‌ను తగ్గించుకున్నారు. కాల్షీట్ల కోసం హీరోయిన్లు తగ్గించుకోవాల్సిన బరువును ఈయనగారు తగ్గించుకోవడంలో ఓ కారణముంది.
ఏమిటో తెలుసా.. మళ్ళీ తను హీరోగా నటించాలనే ఆలోచనలో ఉన్నట్లు సినీ వర్గాలు కోడైకూస్తున్నాయి. వెయిట్ తగ్గడం కోసం చెన్నై అపోలో ఆసుపత్రిలో లైపో సెక్షన్ చికిత్స చేసుకున్నట్లు సమాచారం. ఇటీవలే భార్యకు విడాకులిచ్చిన ప్రకాష్‌రాజ్ బరువు ఎందుకు తగ్గించుకున్నారనే ప్రశ్న అభిమానుల మధ్య తలెత్తింది. మరీ ప్రకాష్ రాజ్ వెయిట్ తగ్గించడానికి కారణమేమిటో వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉండగా, ప్రకాష్‌రాజ్‌కు కాల్షీట్స్ ఇచ్చికూడా షూటింగ్‌కు సహకరించడం లేదని నిర్మాతల మండలి, ఫిలింఛాంబర్ దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆయనకు మిగిలిన నిర్మాతలు కూడా సహకరించవద్దని ఫిలింఛాంబర్ పేర్కొంది. ఒకవేళ సహకరిస్తే.. ఆపై తీసుకునే వాటికి తమకేమాత్రం సంబంధంలేదని ప్రకటనలో వెల్లడించింది. అయితే ప్రస్తుతం ప్రకాష్ రాజ్ పలు చిత్రాల్లో నటిస్తున్నారు. పైగా నిర్మాత మండలి ప్రకాష్ రాజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా.