1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

ఆత్మహత్యా యత్నం చేశానా... నేనా..?!

ఆధ్యాత్మికం వెండితెర గుసగుసలు దేవదాసు పోకిరి ఇలియానా
WD

హాయిగా వున్నా...

దేవదాసు, పోకిరి సినిమాల ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ "ఇలియానా". ఈ అందాల భామ ఇటీవల ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు వార్తలు వెలువెత్తాయి. అయితే తను అటువంటి ఆలోచనలు చేసే పిరికిదాన్ని కాదనీ , అయినా తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పలు వెబ్‌సైట్లు రకరకాలుగా కథలు రాస్తున్నాయని తీవ్రంగా ధ్వజమెత్తింది.

అవన్నీ అవాస్తవములని, తాను హాయిగానే ఉన్నానని మరీ చెబుతోంది. ప్రస్తుతం బ్యాంకాక్‌లో కుటుంబసభ్యులతో హాయిగా గడుపుతున్నట్లు ఆమె ప్రకటించింది. ఇదిలా ఉండగా, టాలీవుడ్‌లోనూ బిజీ బిజీ ఉంటున్న ఈ భామకు కోలీవుడ్‌లోనూ ఆఫర్లు వెల్లువల్లా వస్తున్నాయి.

ఇందులో భాగంగా కోలీవుడ్‌లో ఇలియానా రెండు చిత్రాల్లో నటించబోతోంది. మరోవైపు "సుల్తాన్ ది వారియర్" చిత్రంలో రజనీ సరసన నటించే ఛాన్స్‌ను ఇలియానా అందుకోలేక పోయింది. బిజీ షెడ్యూల్‌ మధ్య కాల్షీట్ తేదీని ఇవ్వడం కష్టమనిపించి ఈ ఛాన్స్‌ను ఇలియానా మిస్ చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఇలియానా టాలీవుడ్‌లో విష్ణు , నితిన్, జూనియర్ ఎన్టీఆర్‌ల సరసన మూడు చిత్రాల్లో నటిస్తోంది.
About Writer
Selvi