1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

సుస్మితకు పెళ్ళంటే కోపమెందుకో?

వినోదం వెండితెర గుసగుసలు బాలీవుడ్‌ టాలీవుడ్‌ సుస్మితాసేన్
WD
బాలీవుడ్‌లోనూ, టాలీవుడ్‌లోనూ తన అందాలను ఆరబోస్తూ.. తన ఒంపు సొంపులతో మైమరపిస్తున్న సుస్మితాసేన్ ఈ మధ్య ఎందుకనో చాలామందికి కాస్త దూరంగా ఉంటోంది. కానీ హఠాత్తుగా ఆత్మీయ సహచరులందరికీ తన ఇంట్లోనే పార్టీ ఇచ్చింది. కారణమేమిటంటే.. ఈ మధ్యే 34వ ఏట అడుగుపెట్టింది.

పార్టీలో అంతా తాగి డ్యాన్స్‌లు వేస్తూ.. ఎంజాయ్ చేస్తుంటే ఒక్కసారిగా చెంప ఛెళ్ళుమనే శబ్దం రాగానే అంతా ఉలిక్కిపడి అటువైపు తిరిగారు. ఏమిటని ఆరా తీస్తే.. సుస్మిత ఓ అమ్మడి చెంప వాయించింది.

ఎందుకో తెలుసా?... ఇకనైనా పెళ్ళి గురించి ఆలోచించవచ్చుకదా? అని ఆ అమ్మడు అడిగితే... చెంప వాయించి, బూతులు కూడా తిట్టిందట. దీంతో పార్టీ వేడిగా ఉందనుకుని నిదానంగా అందరూ జారుకున్నారు. ఆల్‌రెడీ పెళ్ళికాకుండా తల్లి అయిన సుస్మిత.. అదేనండీ.. ఒక బిడ్డను దత్తత తీసుకున్న సుస్మితకు మరీ పెళ్ళంటే అంత కోపమెందుకో?...!
About Writer
Selvi