గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » నాజూకు కోసం సంగీత తంటాలు!
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
WD
నాజూగ్గా కనిపించేందుకు చాలామంది హీరోయిన్లు వివిధ రకాల అలవాట్లను పాటిస్తుంటారు. కొందరు డైటింగ్ చేస్తుండగా, మరికొందరు.. భక్తితో ఉపవాసాలూ ఉంటారు. ఇందులో రెండో కోవలోకి చెందిన నటి... సంగీత. ఆషాఢ మాసం సందర్భంగా ఆమె ఏదో ఒక వ్రతం చేస్తోందట. దానికోసం ఉపవాసం కూడా ఉంటోందట.

ఈ మధ్యే "ఇంద్రజిత్" అనే సినిమాలో నటిస్తున్న ఈ అందాల భామ... షూటింగ్‌లో గానీ, బయట ఫంక్షన్లలో గానీ కనీసం గారెలు కూడా తినటం లేదని భోగొట్టా. ఇలాగే ఓ రోజు చికెన్, గారెలు వంటి చక్కని ఫుడ్ ఆమె ముందుంటే.. మనస్సు చంపుకుని మంచినీళ్ళు తాగి కడుపు చల్లార్చుకుందట.

సాయికుమార్ పుట్టినరోజు సందర్భంగా కేక్‌ను కట్ చేశాక ఆమె నోట్లో కేక్‌ ముక్కను పెట్టబోతుంటే.. వద్దని చేత్తో వారించి, తిరిగి ఆయన నోట్లో పెట్టింది. ఏంటీ... ఇందులో నాన్‌వెజ్‌ వుండదు కదా.. అని సాయికుమార్ ప్రశ్నిస్తే... ఇందులోనూ కోడిగుడ్డు ఉంటుంది కదా? అని సమాధాన మిచ్చిందట.

అంతేమరి.. ముద్దుగా, నాజూగ్గా కనిపించేందుకు ఇలాంటి తిప్పలు తప్పవు కదా. అపుడే కదా పలువురి నిర్మాతలు, హీరోల దృష్టిలో పడుతారు. ఆ తర్వాత... ఛాన్సులే.. ఛాన్సులు. ఇదంతా.. సినీ మాయకదా..!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర గుసగుసలు నాజూ కోసం సంగీత తంటాలు