'హృదయ' కొలతలు పెంచుకున్న శ్రియ!
'శివాజీ' భామ శ్రియ.. తన హృదయ కొలతల ఎత్తును పెంచుకున్నట్టు రాజధాని ఫిల్మ్ వర్గాల్లో వార్తలు గుప్పుమంటున్నాయి. సన్నగా, నాజూకు నడుము చిన్నది ఇప్పటి వరకు మంచి అవకాశాలే కొట్టేసింది. ఇటు తెలుగులో మెగాస్టార్, యువసామ్రాట్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించింది.
అలాగే తమిళంలో కూడా.. సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించింది. దీంతో ఒక్కసారి టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. అయితే ఈ భామ తన అందాలను ఆరబోసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
అయితే అవకాశాల కోసం కొంతమంది సీనియర్ నటీమణులతో సహా కొత్తతరం హీరోయిన్లు అంగాంగ ప్రదర్శన చేసేందుకు పోటీ పడుతున్నారు. తమ శరీర కొలతలను పూర్తి స్థాయిలో చూపించేందుకు 'సై' అంటున్నారు.
ఈ విషయంలో బాగా వెనుకబడిన శ్రియ.. తాజాగా తన హృదయ కొతలను మరింత పెరిగేలా శస్త్రచికిత్స చేయించుకున్నట్టు సమాచారం. అయితే.. ఇది ఎంతమేరకు ఫలితాన్ని ఇచ్చిందో శ్రియనే అడిగి తెలుసుకోవాలి.

