1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

ఎవరినీ ప్రేమించలేదు..! : జెనీలియా

వినోదం వెండితెర గుసగుసలు వృత్తి ప్రియుడు జెనీలియా మహారాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు రితీష్ దేశ్‌ముఖ్‌
WD
ఎవరైనా వృత్తినే ప్రేమిస్తారు. మరి ఈడు వచ్చాక ప్రియుడ్ని ప్రేమిస్తారు. అదే విషయాన్ని జెనీలియా ముందుంచితే ఇంతెత్తునలేస్తుంది. తాను నిజజీవితంలో ఎవరినీ ప్రేమించలేదనీ, సినిమాల్లో మాత్రం ప్రేమించినట్లు నటిస్తానని చెబుతోంది. ఇటీవలే మహారాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు రితీష్ దేశ్‌ముఖ్‌తో ప్రేమలో పడినట్లు ముంబైలో వార్తలు వెలువెత్తిన నేపథ్యంలో.. ఆ వార్తలు అవాస్తవమని చెబుతూ అమ్మడు పైవిధంగా వివరించింది.

వరుస హిట్లతో దూసుకుపోతోన్న 'జెనీలియా'.. 'బాయ్స్' చిత్రంతో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తెలుగులో "బొమ్మరిల్లు", "ఢీ", "రెడీ" వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపును సంపాదించిపెట్టాయి. 'బొమ్మరిల్లు', 'ఢీ' చిత్రాలు వరుసగా హిట్లు సాధించడంతో జెనీలియాకు బాగా కలిసివచ్చింది.

అదేసమయంలో 'బొమ్మరిల్లు' తమిళ రీమేక్‌ చిత్రం "సంతోష్ సుబ్రహ్మణ్యం" కూడా విజయం సాధించడంతో జెనీలియా ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఆఫర్లవెల్లువల్లో బిజీబిజీగా ఉంటున్న జెనీలియా... ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తోన్న చిత్రంలో నటిస్తోంది.