1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

శంకరాచార్యునిగా ఉదయ్‌కిరణ్!

వినోదం వెండితెర గుసగుసలు ప్రతిష్టాత్మక చిత్రం ఆదిశంకరాచార్యుడు ఉదయ్‌కిరణ్
WD PhotoWD
ప్రతిష్టాత్మక చిత్రంగా ఆదిశంకరాచార్యుని పాత్రలో ఓ కొత్త చిత్రాన్ని నిర్మించడానికి ప్రముఖ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ పాత్ర కోసం ఎవరైతే బాగుంటారని ఆలోచిస్తూ ఆర్టిస్టులను ఎంపికచేయగా, ఆఖరికి ఉదయ్‌కిరణ్ సరిపోతారని నిర్ణయించింది.

ఆధ్యాత్మిక చిత్రాల రచయితగా పేరు తెచ్చుకున్న జె.కె.భారవి ఈ చిత్ర బాధ్యతను తన భుజ స్కంధాలపై వేసుకున్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తీయాలని ఆలోచిస్తున్నప్పటికీ తనే దర్శకత్వం వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే ఉదయ్‌కిరణ్ ఫోటోసెషన్ జరిగింది. శంకరాచార్యుల పోలికలు ఉదయ్‌కిరణ్‌లో ప్రస్ఫుటంగా కన్పించాయని యూనిట్ అంతా చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలియవచ్చింది. దాదాపు మూడు భాషల్లో దీన్ని నిర్మించే ఆలోచనలో ఉన్నారు. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఉదయ్‌కిరణ్‌కు ఈ సినిమా ఏవిధంగా హెల్ఫ్ కాగలదో వేచి చూడాల్సిందే...