మళ్ళీ కలుస్తున్న "రోజాపూలు" జంట!
|
ఈయన గతంలో "తమ్ముడు" సినిమాను రూపొందించారు. భాస్కర రెడ్డి నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వారిద్దరి కెమిస్ట్రీ బాగుంటుందని, ఆడియన్స్‌కు మళ్ళీ కొత్తదనం చూపిస్తారని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం భాస్కర్ రెడ్డి నాగబాబుతో "ఏక్‌పోలీస్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇకపోతే "భూమిక" మల్లెపూవు చిత్రంలో నటిస్తోంది. మరోవైపు "పోలీస్ పోలీస్"లో శ్రీరామ్ పోలీసుగా నటిస్తున్నారు. అంతా బిజీగా ఉన్నా ఆగస్టు నెలాఖరుకు డేట్స్ దొరకడంతో కొత్త సినిమా రూపొందనుందని తెలిసింది.
