1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

ఇదంతా సహజమే..! : రాజీవ్

వినోదం వెండితెర గుసగుసలు కెమిస్ట్రీ రాజీవ్ కనకాల
WD
ఎవరైనా ఇద్దరు కలిసి నటిస్తే చాలు. వారిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ నడుస్తోందని వార్తలు గుప్పుమంటాయి. ప్రస్తుతం రాజీవ్ కనకాల, సింధుతులాని పరిస్థితి కూడా అలాంటిదే. డి. రమేష్ బాబు నిర్మిస్తోన్న తాజా చిత్రంలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. థ్రిల్లర్ గొలిపే కథాంశంతో రూపొందుతోంది.

ఇందులో సింధుతులాని కాస్త గ్లామరస్‌గా కూడా కన్పిస్తోంది. ఆల్‌రెడీ వీరిద్దరూ "బ్లాక్ అండ్ వైట్" సినిమాలో నటించారు. సింధుతో ఇప్పుడంతా కలర్‌గా నటిస్తున్నారా? అని రాజీవ్‌ను అడిగితే...? మీరన్నది అర్థమయిందంటూ... అదేమీ లేదండి... మంచి ఫ్రెండ్స్ మాత్రమే.. బ్లాక్ అండ్ వైట్ సినిమాలో కొన్ని సీన్స్ రియల్‌గా నటించమన్నారు.

అదంతా ఆ షాట్ వరకే... అయినా ఈ ఫీల్డులో ఇవన్నీ సహజమేనండీ.. మా ఇద్దరి మధ్య ఏ సంబంధంలేదని చెప్పారు. ఆల్ రెడీ ఈ విషయం తన భార్య సుమక్కూడా తెలిసిందని, ఇలాంటి వార్తలు రావడం కామనే కదా అని... కొట్టిపారేశారు. మరీ... సింధుతులానీ ఏమంటుందో...?
About Writer
Selvi