1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. 12 పాత్రల్లో మాజీ ప్రపంచ సుందరి

12 పాత్రల్లో మాజీ ప్రపంచ సుందరి

పద్మశ్రీ' కమల్‌హాసన్‌ ఒకే చిత్రంలో పాత్రలు ధరించి భారత చలన చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు
'పద్మశ్రీ' కమల్‌హాసన్‌ ఒకే చిత్రంలో పాత్రలు ధరించి భారత చలన చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు సృష్టించారు. 'దశావతారం' చిత్రంలో కమల్ నటన పట్ల అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వచ్చాయి. తాజాగా.. బాలీవుడ్ భామామణి ప్రియాంకా చోప్రా కూడా 12 పాత్రలను పోషించనున్నారు. అశుతోష్ గౌరికర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా తన నటనతో ఆకట్టుకోనుంది. పూర్తిగా జాతక చక్రంపై తీస్తున్న ఈ చిత్రానికి 'వాట్స్ యువర్ రాశి' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
FileFILE
మేషం, వృషభం, మకరం ఇలా.. 12 రాశుల ఆధారంగా చేసుకుని ఈ చిత్ర కథను తయారు చేశారు. ఒక్కో రాశికి ఒక్కో పాత్ర చొప్పున మొత్తం 12 పాత్రల్లో ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. అశుతోష్ గౌరీకర్ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'జోదా అక్బర్' చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెల్సిందే. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఐశ్వర్యారాయ్‌లు జంటగా నటించారు.
FileFILE
గతంలో తమిళ వెండితెరపై యువహీరో విజయ్ సరసన జోడీగా కనిపించిన ప్రియాంక, ఆ తర్వాత మెల్లగా బాలీవుడ్ చిత్ర రంగ ప్రవేశం చేశారు. మాజీ ప్రపంచ సుందరి అయిన... బాలీవుడ్‌లో స్థిరపడిన విషయం తెల్సిందే. గత రెండేళ్ళ కాలంలో ప్రియాంకచోప్రా నటించిన పలు చిత్రాలు మంచి సక్సెస్‌నే సాధించాయి. ఆమె చివరిగా హర్మేన్ బవేజాతో కలిసి నటించిన 'లవ్ స్టోరీ 2050' చిత్రం విజయం సాధించాయి.
About Writer
PNR