1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

నిర్మాతకు సహకరించిన హన్సిక!

వినోదం వెండితెర గుసగుసలు దేశముదురు బన్నీ అందాల భామ హన్సిక
WD
"దేశముదురు" సినిమాలో బన్నీ సరసన నటించిన అందాల భామ హన్సిక నిర్మాతకు సహకరించిందట! ఎలాగో తెలుసా? షూటింగ్‌లో ఆమెకు గాయం తగిలినప్పటికీ ఒక గంటపాటు చికిత్స పొంది తిరిగి షూటింగ్‌లో పాల్గొందట. చిన్న గాయం తగిలితేనే షూటింగ్‌‌ను క్యాన్సిల్ చేసే హీరోహీరోయిన్ల నడుమ ఈ భామ గాయాన్ని లెక్కచేయకుండా నిర్మాతకు సహకరించిందని సినీ వర్గాలు మెచ్చుకుంటున్నాయట.

సుమంత్ ఆర్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ హీరోగా, హన్సిక హీరోయిన్‌గా, ఎం.ఎస్.రాజు నిర్మిస్తున్న "మస్కా" సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో జరుగుతోంది. షూటింగ్ స్పాట్‌కు వచ్చే దారిలో జరిగిన ఓ ప్రమాదంతో ఆమె చేతికి గాయం ఏర్పడింది.

దీనితో చికిత్సకోసం ఆస్పత్రికి చేరుకున్న హన్సిక... ఇక షూటింగ్‌లో పాల్గొనదని, షూటింగ్ క్యాన్సిల్ అయినట్టేనని అందరూ భావిస్తుండగా, ఉన్నట్టుండి స్పాట్‌లో ప్రత్యక్షమైంది. విషయమేమంటే... ఓ గంటపాటు గాయానికి చికిత్స పొంది షూటింగ్‌ స్పాట్‌కు చేరుకుందట. ఇంకేముంది... హన్సిక షూటింగ్‌లో పాల్గొనడం ద్వారా నిర్మాతకు పలు లక్షల రూపాయల నష్టం కాకుండా, సమయం వృధా చేయకుండా సహకరించిందట.
About Writer
Selvi