టాలీవుడ్ బ్యూటీ "ఫర్జానా" ఐటంసాంగ్‌లో కనిపించబోతోందట. అల్లరి నరేష్ సరసన 'బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్' వంటి పలు సినిమాల్లో నటించిన ఈ అందాల ముద్దుగుమ్మ మొదటిసారిగా "ఐటంసాంగ్"లో తన అందచందాలను వలకబోయనుంది. భూమిక, మురళీకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న "మల్లెపూవు" సినిమాలోని "నాతో వస్తావా...!" అనే పాటలో ఫర్జానా ఐటంగర్ల్‌గా కనిపించబోతోంది.
ఈ పాటలో అమ్ముడు పెద్ద ఎత్తున తన అందచందాలను ఆరబోసేందుకు సిద్ధమైనట్టు టాలీవుడ్ పేర్కొంటోంది. హీరోయిన్‌గా ముద్రవేసుకున్న ఫర్జానా... ఐటం గర్ల్‌గా యువతను ఆకట్టుకునేందుకు సిద్ధమౌతోంది.
ఇకపోతే "మల్లెపూవు" సినిమాకు ఇళయరాజా సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఆడియోకు శ్రోతల నుంచి మంచిస్పందన లభించింది. వి.సముద్ర దర్శకత్వంలో, రమేశ్‌వర్మ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న "మల్లెపూవు" సినిమా సెప్టెంబర్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.