1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. త్వరలో మూడు ముళ్లు వేయించుకుంటా..!: శిల్ప

త్వరలో మూడు ముళ్లు వేయించుకుంటా..!: శిల్ప

వినోదం వెండితెర గుసగుసలు బిగ్ బాస్ షో రియాల్టీ  శిల్పాశెట్టి పెళ్లి మూడు ముళ్లు వేయించుకుంటా శిల్ప

పెళ్లి చేసుకోబోతున్నా

"బిగ్ బాస్ రియాల్టీ షో"ను నిర్వహిస్తున్న సుందరీమణి... శిల్పాశెట్టి త్వరలో పెళ్లి చేసుకోబోతుందట.. అదీ ఏడాదిన్నరలోపు మూడుముళ్లు వేయించుకుంటానని చెబుతోందీ పొడువు కాళ్ల సుందరి. ఏడాదిన్నరలో ఓ ఇంటిదాన్ని కాబోతున్నానని, బాయ్‌ఫ్రెండ్ రాజ్ కుంద్రాతోనే తన పెళ్లి జరుగుతుందని లండన్ మీడియా ముందు శిల్పాశెట్టి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.

 
   

 

ఇద్దరు పిల్లలకు తల్లినవుతా


ప్రేమ, పెళ్ళి విషయాలపై లండన్ మీడియా ఆమెను కదిలిస్తే... రాజ్ కుంద్రాను ఏడాది కింద కలిశానని... రాబోయే ఒకటిన్నర సంవత్సరానికి తీరికలేని కార్యక్రమాలున్నాయని తెలిపింది. ఆ తర్వాతే తన ప్రేమికునితో వైవాహిక జీవితంలో అడుగిడుతానని వెల్లడించిందట. తనకంటూ ఓ కుటుంబం కావాలని, ఇద్దరు పిల్లలకు తల్లినవ్వాలని శిల్ప ఆశిస్తోందట. ఇంకేముందీ... శిల్పశెట్టికూడా త్వరలో పెళ్లి కూతురుకానుందన్నమాట...!