1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

శృతిమించని గ్లామర్‌కే ప్రాధాన్యత : తమన్నా

వినోదం వెండితెర గుసగుసలు పరిమితి  గ్లామర్ సినిమాలు గ్లామర్ శృతి తమన్నా
WD
పరిమితితో కూడిన గ్లామర్ సినిమాలకు అవసరమేనని, అయితే గ్లామర్ శృతి మించకూడదని అందాల ముద్దుగుమ్మ తమన్నా అంటోంది. యువసామ్రాట్ అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా నటించిన "కాళిదాసు" సినిమాలో తమన్నా హీరోయిన్ పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం "కొంచెం ఇష్టం కొంచెం కష్టం" అనే తెలుగు సినిమాలో నటిస్తోంది. ఈ సందర్భంగా హ్యాపీడేస్ ఫేం అందాల భామ తమన్నాను కదిలిస్తే.. స్విమ్మింగ్ డ్రస్‌లో నటించమని చాలా సినిమాల్లో డైరక్టర్లు కోరారని చెప్పింది.

అయితే స్విమ్ సూట్‌లో నటించడం ఇష్టం లేక కాదనేశానని ఆమె వెల్లడించింది. దీని వల్ల కొన్ని అవకాశాలను కూడా అమ్మడు మిస్సైందని వెలిబుచ్చింది. టాలీవుడ్‌లోనూ, కోలీవుడ్‌లో ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయని... ప్రస్తుతానికి కోలీవుడ్‌పై దృష్టి పెట్టానని తమన్నా అన్నది.

ఇకపోతే.. కోలీవుడ్‌లో తమన్నా నటించిన "కేడీ" సినిమా హిట్ కాకపోయినా, "కల్లూరి" అనే సినిమాతో ఆమెకు గుర్తింపు లభించింది. కోలీవుడ్ టాప్ హీరోల సరసన నటించే ఈ భామకు.. తన పేరులో "ఎ", "హెచ్" అనే ఆంగ్ల అక్షరాలను అదనంగా చేర్చుకున్నాకే కలిసొచ్చిందని సినీ వర్గాలు కోడైకూస్తున్నాయి.