ఎక్స్‌పోజింగ్‌కు "నో" అంటున్న పల్లవి..!
Publish: Thu, 11 Sep 2008 (17:52 IST)
Updated: Thu, 11 Sep 2008 (17:28 IST)
"
అంకిత్, పల్లవి అండ్ ఫ్రెండ్స్" సినిమాలో హీరోయిన్‌గా అద్భుతమైన నటనను ప్రదర్శించిన ముంబై ముద్దుగుమ్మ మేఘాబర్మన్ ఎక్స్‌పోజింగ్ అంటే "నో" అంటోంది. మంచి ఆర్టిస్టుగా ఎదగాలంటే ముఖ హావభావాలు, నటనా తీరు చాలా ముఖ్యమని ఆమె అంటోంది. కేవలం ఎక్స్‌పోజింగ్ చేయడం ద్వారానే మంచి ఆర్టిస్టుగా గుర్తింపు సాధించలేమని పల్లవి చెబుతోంది.సక్సెస్ ఫుల్ మూవీతో టాలీవుడ్‌లో రంగ ప్రవేశం చేయడం ఆనందంగా ఉందని, తను పోషించిన పల్లవి పాత్రని ఎప్పటికీ మరచిపోలేనని మేఘా బర్మన్ వెల్లడించారు. ఇకపోతే.. తదుపరి చిత్రం కోసం స్క్రిప్ట్‌లు వింటున్నానని, తెలుగు సినీ పరిశ్రమ తనకెంతో నచ్చిందని ఆమె తెలిపింది. తన కెరీర్‌ను టాలీవుడ్‌లో డెవలప్ చేసుకుంటానని, వీలైనంత వరకు ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటానని ఈ భామ అంటోంది.