1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

కమల్ "మర్మయోగి"లో వెంకీ..!?

వినోదం వెండితెర గుసగుసలు దశావతారం డూపర్ హిట్ కమల్హాసన్ మర్మయోగి విక్టరీ వెంకటేష్
WD
"దశావతారం" సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన పద్మభూషణ్ కమల్‌హాసన్ తదుపరి చిత్రమైన "మర్మయోగి"లో విక్టరీ వెంకటేష్ నటించబోతున్నారట. ఆశ్చర్యంగా ఉంది కదూ...? నిజమేనండీ...! కమల్ భారీ బడ్జెట్‌తో రూపొందించనున్న "మర్మయోగి" సినిమాలో వెంకీ కీలక పాత్ర పోషించనున్నారట.

హిందీ, తమిళం, తెలుగు భాషల్లోనూ కమల్ హాసన్ చెంతనే వెంకీ నటిస్తారని సినీ వర్గాల్లో టాక్. దేశ వ్యాప్తంగా "మర్మయోగి" సంచలనం సృష్టిస్తుందని కమల్ అభిమానులు భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కథాపరంగా దశావతారం హీరోతో పాటు నటించే పాత్రకు వెంకీ నటన అద్భుతంగా ఉంటుందని కమల్ భావించి, వెంకటేష్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది.

"లక్ష్మీ", "తులసి", "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" వంటి సినిమాల ద్వారా మల్టీస్టారర్‌గా మారిన వెంకటేశ్‌కు, కమల్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందంటే ఇంకేముంది..? "చింతకాయల రవి"కి అదృష్టం తలుపు తట్టినట్లేగా...?