1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

అది నా పర్సనల్... అవన్నీ మీ కెందుకు?

వినోదం వెండితెర గుసగుసలు టాలీవుడ్ అత్యధిక పారితోషికం అగ్రహీరోయిన్లు ఇలియానా భలేదొంగలు
టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం పుచ్చుకునే అగ్రహీరోయిన్లలో "ఇలియానా" ఒకటి. "భలేదొంగలు" చిత్రం నుంచి తన రేటును కోటిరూపాయలకు పెంచేసుకున్న ఇలియానా అదే ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. ఈ విషయమై ఎవరేమైనా అడిగినా ఇది తన పర్సనల్ అని అవన్నీ మీకేందుకుని ప్రశ్నించింది కూడా...!

అప్పటి నుంచి తన రెమ్యునరేషన్‌ను ఏమాత్రం తగ్గించకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇటీవలే రజనీకాంత్ యానిమేషన్ సినిమా "ది సుల్తాన్ ది వారియర్" ఆఫర్ వచ్చిన ససేమిరా అంది. పారితోషికం తగ్గించడమే తిరస్కారానికి కారణమంటూ సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి.

ప్రస్తుతం తమిళ్ హీరో విజయ్‌తో "వేట్టయ్ కారన్" అనే సినిమాలో నటిస్తోంది. అందుకుగాను 1.25 కోట్లతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిసింది. పరభాషా నటీమణులకు నిర్మాతలు హీరోలు ఎంతైనా ఇచ్చి తెచ్చుకుంటున్నారనే విమర్శలు వచ్చినా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి మరి...!.
About Writer
Selvi