1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

"సిల్క్‌స్మిత"గా మల్లికా శెరావత్!

వినోదం వెండితెర గుసగుసలు దివంగత నటి సెక్సీక్వీన్ బాలీవుడ్ సినీతార మల్లికా శెరావత్ శృంగార నర్తకి
దివంగత నటి, సెక్సీక్వీన్ "సిల్క్‌స్మిత" పాత్రలో బాలీవుడ్ సినీతార "మల్లికా శెరావత్" నటించనుంది. దక్షిణాది సినీ రంగాల్లో 1980 నుంచి శృంగార నర్తకిగా రాణించిన "సిల్క్‌స్మిత" జీవిత చరిత్ర త్వరలో తెరకెక్కనుంది. ప్రముఖ బుల్లితెర నిర్మాత ముక్తాకపూర్ తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందించనున్నారు.

ఈ సందర్భంగా ముక్తాకపూర్ మాట్లాడుతూ... "సిల్క్‌స్మిత" జీవితంలోని పలు కీలక సంఘటనల్ని తాను సేకరిస్తున్నానన్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు.

ఇకపోతే మల్లికా శెరావత్‌ను సిల్క్ స్మిత పాత్రధారిగా ఎంచుకునేందుకు సిద్ధమైయ్యామని, ఈ పాత్రలో మల్లికా నటించేందుకు సానుకూలంగా స్పందించినట్లు కపూర్ తెలిపారు. మరోవైపు టెక్నీషియన్లను ఎంపికచేసుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయని కపూర్ చెప్పారు.

ఇదిలా ఉండగా, 1980 నుంచి సినీ రంగంలో తన అందచందాలను ఒలకపోస్తూ కుర్రకారును అలరించిన సిల్క్‌ స్మిత, గత 1996లో ఆమె ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
About Writer
Harsha Vardhan