"కత్రీనా" చేతిలో భారీ సినీ ప్రాజెక్టులు!
బాలీవుడ్ అగ్రనటి కత్రీనా కైఫ్ చేతిలో భారీ సినీ ప్రాజెక్టులున్నాయట. వాటి విలువ 3.5 కోట్లని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. బాలీవుడ్ అగ్రహీరోల సరసన నటిస్తూ.. తన అందచందాలతో ప్రేక్షకులను అలరిస్తున్నకత్రీనా కైఫ్ తాజాగా ఇరు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించే అవకాశాన్ని కొట్టేసింది.
అబ్బాస్-ముస్తాన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ బంపర్ హిట్ "రేస్" సినిమాలో కత్రీనా కైఫ్ నటించిన సంగతి తెలిసిందే. ఇదే కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న కొత్త సినిమాలోనూ కత్రీనా కైఫ్ నటించనుందని బాలీవుడ్ వర్గాల సమాచారం.
ఇదేవిధంగా హాలీవుడ్ చిత్ర మాతృకను ఆధారంగా తీసుకుని బాలీవుడ్‌లో తెరకెక్కనున్న మరో చిత్రంలోనూ కత్రీనా ప్రధాన పాత్ర పోషించనుంది. ఈ ఇరు పాత్రల ద్వారా కత్రీనా కైఫ్‌కు మంచి గుర్తింపు లభిస్తుందని సమాచారం. దీనికి సంబంధించిన అగ్రిమెంట్లపై ఇప్పటికే కత్రీనా సంతకాలు చేసేసిందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా... విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన "మల్లీశ్వరి" సినిమాలో కత్రీనా హీరోయిన్‌గా చేసింది. అదేవిధంగా బాలకృష్ణ హీరోగా చేసిన "అల్లరిపిడుగు"లోనూ కత్రినా హీరోయిన్ పాత్రను పోషించింది.