హాలీవుడ్‌లో అడుగిడనున్న స్నేహా ఉల్లాల్!
బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వలస వచ్చిన కథానాయిక స్నేహా ఉల్లాల్. కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన "లక్కీ" సినిమాలో అద్భుతంగా నటించిన ఉల్లాల్... "ఉల్లాసంగా... ఉత్సాహంగా" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా హిట్ సాధించడంతో స్నేహ ఉల్లాల్‌కు అటు హిందీ, ఇటు తెలుగు సినీ రంగాల నుంచి అవకాశాలు వెల్లువల్లా వచ్చాయి.
తాజాగా మనోజ్ సరసన "నేను మీకు తెలుసా?" సినిమాలో ఉల్లాల్ నటించిన సంగతి తెలిసిందే. మరోవైపు అక్కినేని నాగార్జున మేనల్లుడు, సుశాంత్ చెంతన "కరెంట్" అనే చిత్రంలోనూ హీరోయిన్‌గా నటించే ఛాన్స్‌ను కొట్టేసింది.
ఈ నేపథ్యంలో స్నేహా ఉల్లాల్‌కు హాలీవుడ్‌లో నటించే అవకాశం వచ్చిందట.! "గాంధీ పార్క్" అనే పేరిట టామ్ జార్జ్ దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రంలో ఉల్లాల్ నటింబోతుందట.
అంతేకాకుండా అశోక్ త్యాగి చిత్రీకరించే "ఆర్యన్" అనే కొత్త హిందీ చిత్రంలోనూ అమ్మడు కథానాయికగా పాత్రను పోషిస్తోందట. ఈ ఇరు సినిమాల్లో నటించేందుకు పచ్చజెండా ఊపుతూ.. దీనికి సంబంధించిన అగ్రిమెంట్‌లో ఇప్పటికే ఉల్లాల్ సంతకాలు కూడా చేసేసిందని సన్నిహిత వర్గాల సమాచారం. ఇంకేముంది...? స్నేహా ఉల్లాల్‌కు అదృష్టం పండినట్టేగా...!