1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

రాజశేఖర్ సరసన లారా దత్త!

వినోదం వెండితెర గుసగుసలు డాక్టర్ రాజశేఖర్ సరసన లారా దత్త బాలీవుడ్ సెక్సీక్వీన్ ఐటమ్ గర్ల్
డాక్టర్. రాజశేఖర్ తాజా సినిమా "సత్యమేవ జయతే..!"లో బాలీవుడ్ సెక్సీక్వీన్ లారా దత్త నటించబోతుందట. ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన లారా దత్త రొమాంటిక్ సన్నివేశాల్లో నటించనుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇంతకీ... అసలు విషయమేమిటంటే...? లారా దత్త "సత్యమేవ జయతే" సినిమాలో హీరోయిన్‌గా నటించలేదట.. ఓ పాటలో ఐటమ్ గర్ల్‌గా మాత్రమే తన అందాలను ఆరబోస్తుందని సినీ వర్గాల సమాచారం.

ఇకపోతే... హిందీలో "ఖాఖీ" పేరుతో రూపుదిద్దుకున్న ఈ సినిమాను తెలుగులోకి "సత్యమేవ జయతే..!"గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీ ఖాఖీలో లారా దత్త ఓ ఐటం సాంగ్‌లో ప్రేక్షకులను అలరించింది.

అదే విధంగా తెలుగులోనూ... లారా దత్త ఓ పాటలో కన్పించాలని రాజశేఖర్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారట. ఈ అంశంపై ఆయన సతీమణి జీవిత రాజశేఖర్‌తో కూడా చర్చిస్తున్నారట. ఎందుకంటే...? "సత్యమేవ జయతే" సినిమాకు దర్శకత్వం వహించేంది ఆమే కాబట్టి...!
About Writer
SELVI.M