1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

"పద్మశ్రీ ఏడుకొండలు"లో నేనా...? నో ఛాన్స్...!

వినోదం వెండితెర గుసగుసలు పద్మశ్రీ ఏడుకొండలు హీరోయిన్ నో ఛాన్స్ అల్లరి నరేష్ తమన్నా కొంచెం ఇష్టం కొంచెం కష్టం
అల్లరి నరేష్ హీరోగా, విజయ సారధి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న తాజా చిత్రం "పద్మశ్రీ ఏడుకొండలు"లో "హ్యాపీడేస్" ఫేమ్ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోందని వార్తలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. నల్లమలుపు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం స్వస్తిక్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కనుంది.

ఈ నేపథ్యంలో... అల్లరి నరేష్ "పద్మశ్రీ ఏడుకొండలు" చిత్రంలో తాను హీరోయిన్‌గా నటించలేదని తమన్నా అంటోంది. మీడియా వార్తలపై తమన్నా మండిపడింది. నిర్మాత తన ప్రమేయం లేకుండా అల్లరి నరేష్ కొత్త చిత్రంలో తాను నటిస్తున్నానని ఎలా ప్రకటించారని తమన్నా ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో సిద్ధార్థ్ సరసన "కొంచెం ఇష్టం... కొంచెం కష్టం..." సినిమాలో మాత్రమే నటిస్తున్నానని, ఈ చిత్రానికి కిషోర్ దర్శకత్వం వహింస్తుండగా, నల్లమలుపు శ్రీనివాస్ నిర్మిస్తున్నారని వివరించింది.

మరోవైపు మహేష్ బాబు సరసన నటిస్తున్నట్లు కూడా తమన్నాపై వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలను కూడా తమన్నా తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. తరచుగా ఇటువంటి అవాస్తవ వార్తలతో ఇబ్బంది పడుతున్న తమన్నా, టాలీవుడ్‌లో మళ్లీ ఏ సినిమాతో వార్తల్లోకి రానుందో వేచి చూడాల్సిందే...!.
About Writer
SELVI.M